సినిమా

బాలక్రిష్ణ ‘జైసింహా’ ఫుల్ రివ్యూ.. సినిమా హిట్టా.? ఫట్టా.?

Written by Tolly2Bolly

సంక్రాంతి అంటే బాలకృష్ణ.. బాలకృష్ణ అంటే సంక్రాంతి.. పెద్ద పండగకు విడుదలైన బాలయ్య ప్రతీ చిత్రమూ బాక్సాఫీస్‌ వద్ద ఆకట్టుకున్నదే. తాజాగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘జైసింహా’. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? కె.ఎస్‌.రవికుమార్‌-బాలయ్యల సరికొత్త కాంబినేషన్‌ ఆకట్టుకుందా?

 

Watch Here The Jai Simha Movie Full Review

 

* కథేంటంటే:

నరసింహ పాత్ర పోషించిన బాలకృష్ణ… గౌరి పాత్రలో ఒదిగిన  నయనతారకి తెలియకుండా ఆమె కొడుకుని తీసుకుని విశాఖపట్నం నుంచి కుంభకోణం చేరుకుంటాడు. అక్కడి ఆలయ ధర్మకర్త మురళీమోహన్‌  ఇంట్లో డ్రైవర్‌గా పనిలో చేరతాడు. అయితే ఆ సమయంలో ఆలయ ధర్మకర్త కుమార్తె ధాన్య నటాషా దోషి యాక్సిడెంట్‌ చేయడంతో ఆ నేరాన్ని తనపై వేసుకుంటాడు. దీంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. శత్రువుల దాడి కూడా ఎక్కువవుతుంది. మరోవైపు అక్కడి ఏసీపీని ఎదిరించడంతో అతనికి కూడా శత్రువుగా మారతాడు. దీంతో ఆ చిన్నారిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలను బయలుదేరతాడు. ఇదే సమయంలో గౌరి తన కొడుకుని వెతుక్కుంటూ కుంభకోణం వస్తుంది. అప్పుడు నరసింహకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. నరసింహకు గౌరికీ, సంబంధం ఏంటి? నరసింహ కుంభకోణం ఎందుకు రావాల్సి వచ్చింది?

* ఎలా ఉందంటే:

ఇది బాలకృష్ణ నటించిన మరో మాస్‌, కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. సాధారణంగా బాలకృష్ణ సినిమా హెవీ యాక్షన్‌ డోస్‌తో ప్రారంభం అవుతుంది. ఒక పాటతోనో.. ఫైట్‌తోనే ఆయన పరిచయ సన్నివేశం ఉంటుంది. అయితే ఇందులో మాత్రం కాస్త భిన్నంగా సాగింది. ఓ చంటి బాబుతో కథానాయకుడిని పరిచయం చేశారు. దీంతో సినిమా ఎలా సాగుతుందో ప్రేక్షకుడు ఓ అంచనాకి వచ్చేస్తాడు. అయితే దర్శకుడు తెలివిగా బాలయ్య అభిమానులకు ఏం కావాలో అవి ఇస్తూ, అక్కడక్కడా సెంటిమెంట్‌ను జొప్పిస్తూ, మధ్యలో కథ చెబుతూ నడిపించాడు. తొలి అర్ధభాగం కుంభకోణం నేపథ్యంలో సాగుతుంది. అభిమానులను ఆకట్టుకునేలా ఆయా సన్నివేశాలను తీర్చిదిద్దారు. పురోహితుల గొప్పతనం గురించి చెప్పే సన్నివేశంలో బాలకృష్ణ మార్కు డైలాగ్‌లు నటన, ఆకట్టుకుంటాయి. డైలాగ్‌లు పలకడంలో బాలకృష్ణకు ఉన్న ప్రత్యేకత ఏంటో ఈ సన్నివేశం మరోసారి నిరూపిస్తుంది. విశ్రాంతికి ముందు వచ్చే యాక్షన్‌ సన్నివేశాలను మాస్‌కు నచ్చేలా రామ్‌లక్ష్మణ్‌ తెరకెక్కించారు. అయితే బ్రహ్మానందం ఎపిసోడ్‌లు కాస్త సుదీర్ఘంగా సాగినట్లు అనిపిస్తాయి. నయనతార ఎంట్రీతో కథ మరో మలుపు తిరుగుతుంది.

సెకండాఫ్ లో ఫ్లాష్‌బ్యాక్‌పైనే ఆధారపడ్డాడు దర్శకుడు. నయనతారతో బాలకృష్ణ ప్రేమ సన్నివేశాలు, ప్రకాష్‌రాజ్‌తో సెంటిమెంట్‌ సన్నివేశాలు బాగున్నాయి. అయితే ఆయా సన్నివేశాలకు ఇంకాస్త కత్తెర వేస్తే బాగుండేది. పతాక సన్నివేశాలను విభిన్నంగా తీర్చిదిద్దారు. సెంటిమెంట్‌ను పండించటంలో దర్శకుడు సఫలమయ్యాడు. బాలకృష్ణ ఒక స్వచ్ఛమైన ప్రేమికుడిగా చూపించడంలో విజయవంతమయ్యాడు. అలా ఇది బాలకృష్ణకు ఒక కొత్తరకం సినిమా అనే చెప్పాలి. ఒక ప్రేమికుడి త్యాగంగా ‘జైసింహా’ను అభివర్ణించవచ్చు. వినోదం విషయంలో మరిన్ని కసరత్తులు తీసుకుని ఉంటే బాగుండేది.

మొత్తంగా జైసింహాను బాలయ్య గత చిత్రాలైన నరసింహానాయుడు, సమరసింహారెడ్డి చిత్రాల మాదిరిగా అజ్ఞాతవాసం చేయించి అనంతరం ఫ్యాష్ బ్యాక్ చెప్పించి మధ్యలో పలు ఫ్యాక్షన్ గొడవలు చూపించి ముగించారు. నందమూరి ఫ్యాన్స్ కు అయితే సినిమా సూపర్ హిట్. సాధారణ ప్రేక్షకులు కూడా బాగానే ఉందంటున్నారు.. సో యావరేజ్ మూవీగా జైసింహా మిగిలిపోయింది..

About the author

Tolly2Bolly

Leave a Comment