సినిమా

ప్రేమికుల రోజు సందర్భంగా తన లవర్ ఎవరో చెప్పిన విజయ్ దేవరకొండ.. ఏ హీరోయినో తెలిస్తే షాకే..

Written by Tolly2Bolly

అర్జున్ రెడ్డిగా జీవించి విమర్శల ప్రశంసలు అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ ఒక్క సినిమాతోనే స్టార్ డంతోపాటు యువతుల మనసు దోచుకున్నాడీ హైదరాబాదీ యువ హీరో. అచ్చ తెలంగాణ యాసలో విజయ్ మాట్లాడితే మన పక్కింటో కుర్రాడు మాట్లాడినట్టే ఉంటుంది. తాజాగా ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా తన నిజజీవితంలోని ప్రేమ గురించి చెప్పి సంచలనం సృష్టించాడు..

 

ఐఐటీ ఎలాన్, ఎన్ విజన్ ముగింపు సందర్భంగా ఆ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ‘తనకూ ఓ లవర్ ఉండేది. కానీ అన్ని వదిలేసి సినిమాలు చేస్తున్నాని చెప్పాడు. జీవితంలో ఎంజాయ్ చేయండి కానీ ప్రేమ అంటూ అమ్మాయిల వెంట తిరగొద్దని’ యూనివర్సిటీ విద్యార్థులకు హితబోధ చేశాడు.

అంతేకాదు   విద్యార్థులనుద్దేశించి ‘లవ్ వద్దూ ఏం వద్దూ.. ప్రేమంటూ అమ్మాయిల వెంట తిరగడం టైం వేస్ట్ వ్యవహారం. బాగా చదువుకొని జీవితంలో సెటిలైతే మంచి లైఫ్ ఉంటుంది.. ఆటోమేటిక్ గా మంచి భార్య వస్తుంద’ని కుర్రాళ్లకు సలహా ఇచ్చాడు. అమ్మానాన్నలను బాగా చూసుకోవాలని సూచించాడు. ఇలా అర్జున్ రెడ్డి తనకూ ఓ లవర్ ఉందని.. అదీ సినిమా జీవితంలోని ఏదైనా హీరోయినా.? లేక  సినిమాల్లోకి రాకముందటి బయట వ్యక్తా అనే ప్రశ్నకు మాత్రం నవ్వి ఊరుకోవడం విశేషం.

About the author

Tolly2Bolly

Leave a Comment