వార్తలు

బెడ్రూంలో కెమెరాలు పెట్టి వేధించాడు.. 

Written by Tolly2Bolly
మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బ తింటున్నాయి. ఇందులో ముఖ్యానంగా భార్య భర్తల మధ్య జీవితం ఫై అవగాహన లేక పోవడంతో బతుకులు చిన్న బిన్నమవుతున్నాయి. ఇటీవల పెళ్ళైన మరుసటి రోజే భర్త పైశాచిక దాడితో ఓ మహిళా ఆసుపత్రి పాలైంది. తాజాగా మరో మహిళ ను తన భర్త  చేతిలో హత్యకు గురవడంతో  మనుషులు ఇంత హీనస్థితిలో ఉన్నారా అని అర్థమవుతోంది.
 మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ భోపాల్ నగరంలోని పుష్పనగర్ నివాసి, వ్యాపారవేత్త అయిన ఖేమ్‌రాజ్‌తో 38 ఏళ్ల షేల్‌కుమారికి వివాహమైంది. ఐతే ఈ పెళ్లి వీరిద్దరికీ రొండో వివాహమే.. కుమారి మొదటి భర్తకు విడాకులివ్వగా, ఖేమ్‌రాజ్ కూడా తన భార్య లేకపోవడంతో ఈమెను పెళ్లాడాడు.
కొన్నాళ్లపాటు ఇద్దరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాతే ఖేమ్‌రాజ్ మృగంలా మారాడు. ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.  ఒకరోజు షేల్‌కుమారికి తన సోదరికి    ఫోన్ చేసి ఇంటినిండా కెమేరాలు పెట్టారనీ, చివరికి బెడ్రూంలో కూడా కెమేరాలు అమర్చి తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ విలపించిందని చెప్పుకొచ్చింది. ఐతే అవన్నీ అవాస్తవాలంటున్నాడు ఖేమ్ రాజ్. కుమారికి పిచ్చిపట్టిందనీ, ఆమె ఎక్కడ ఏ అఘాయిత్యానికి పాల్పడుతుందోనని ఇంట్లో కెమేరాలు అమర్చినట్లు వెల్లడించాడు.
చివరికి షేల్‌కుమారి భర్త పెట్టె హింసలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.
ఐతే భర్త మాత్రం తనకు పిచ్చి పట్టడంతోనే మతి స్థిమితం లేక    ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నాడు.  ఆమె ఆత్మహత్య చేసుకోవడం రికార్డు కాలేదా అని అడిగితే మాత్రం నీళ్లు నములుతున్నాడు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

About the author

Tolly2Bolly

Leave a Comment