సినిమా

 ‘సైరా’  కోసం అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ప్ర‌త్యేక సెట్..

Written by Tolly2Bolly
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు ఇది తీపి కబురే. మెగా ఫామిలీ అగ్ర హీరో చిరంజీవి ‘సైరా’ సినిమా మొత్తానికి మొదలైంది. బుధవారం ఉద‌యం హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో వేసిన ప్ర‌త్యేక సెట్ లో షూటింగ్ ను మొద‌లు పెట్టారు.
చిరంజీవి  151వ చిత్రంగా వస్తున్న’సైరా’ ఫిలిం కు రాంచరణ్ నిర్మాత. మెగాస్టార్ 150వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 786’  కూడా ఈయన నిర్మాతగా ఉన్నారు. ఆ సినిమా మంచి  హిట్ కొట్టడంతో ఇప్పుడు ‘సైరా’  అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఇదివరకే ‘సైరా’ కు సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల చేసి సినీ పరిశ్రమలో ఉత్సాహాన్ని నింపారు. ఇప్పుడు సినిమా ప్రారంభం కావడంతో రిలీజ్ డేట్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది.
తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి ద‌ర్శ‌కుడు.. ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి , జ‌గ‌ప‌తిబాబు, సునీల్ త‌దిత‌రులు న‌టించ‌నున్నారు..

About the author

Tolly2Bolly

Leave a Comment