టెక్నాలజీ వార్తలు

వాట్సాప్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్..

Written by Tolly2Bolly

వాట్సప్.. ఇప్పుడు అది లేనిదే పూటగడవని పరిస్థితి.  ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్న వాట్సాప్‌లో లోపాలు ఉన్నాయనే విషయం ఆ యాప్‌‌ను వాడుతున్న వారిని కలవరానికి గురి చేసింది. గ్రూప్‌లో కొత్తగా వస్తోన్న మెసేజ్‌లను బయటి వ్యక్తి చదవగలిగాడని రుహ్ర్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. వాట్సాప్ సర్వర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా సెక్యూరిటీ లేయర్‌ను అధిగమించగలిగామని తెలిపారు. తద్వారా వాట్సాప్ గ్రూప్‌పై పూర్తి కంట్రోల్ వచ్చిందన్నారు. జ్యూరిచ్‌లోని జరిగిన రియల్ వరల్డ్ క్రైప్టో సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ఈ విషయమై నివేదికను సమర్పించారు.

 

Watch Here the Full Story about Whatsapp

 

వాట్సాప్ వాడుతున్న వారికి ఈ వార్త షాకింగ్ లాంటిదే. ఇప్పటికే చాలా మంది గ్రూప్‌ల ద్వారా మిత్రులతో చాటింగ్ చేస్తున్నారు.. వాట్సాప్ గ్రూప్‌ చాట్‌లను బయటి వ్యక్తులు చదివే వీలుందని తేలడంతో భద్రత పరమైన ఆందోళన అందరిలోనూ నెలకొంది.

వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఇన్‌క్రిప్షన్ ఉండటం వల్ల మనం పంపే మెసేజ్‌లను మూడో వ్యక్తి చదివే అవకాశం ఉండదు. కానీ వాట్సాప్‌లోని భద్రతాపరమైన లోపాల వల్ల అడ్మిన్ పర్మిషన్ లేకుండానే గ్రూప్ చాట్‌ను వేరే వ్యక్తులు చదివే వీలుందని పరిశోధకులు తేల్చారు.. అయితే దీనిపై వాట్సాప్ సంస్థ వివరణ ఇచ్చింది.  వాట్సాప్ గ్రూపులోకి ఎవరూ రహస్యంగా చొరబడే అవకాశం లేదని, సమాచారాన్ని ఇతరులు చదివే అవకాశం లేదని వాట్సప్ స్పష్టం చేసింది. ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ద్వారా వాట్సాప్‌లో పూర్తి భద్రత కల్పించామని  తెలిపింది..

About the author

Tolly2Bolly

Leave a Comment