వార్తలు

శశి కపూర్‌ ఆ సమయంలో చాలా కుమిలిపోయారు…

శశి కపూర్‌ ఆ సమయంలో చాలా కుమిలిపోయారు.
Written by Tolly2Bolly

శశి కపూర్‌ ఆ సమయంలో చాలా కుమిలిపోయారు…

తొలితరం బాలీవుడ్‌ నటుడు,  దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత  శశి కపూర్  ఇక లేరనే విషయం బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఆయన దశాబ్దాల పాటు తిరుగులేని నటుడిగా రాణించారు.

ప్రతి సినీ నటుడి జీవితంలో ఓ విషాద సంఘటన ఉంటుందనేది అవాస్తవం కాదు. అలాగే శశి కపూర్ జీవితంలో ఓ సంఘటన తనను తీవ్రంగా కుంగదీసింది. మరి ఆ విషాద సమయాలు ఏంటంటే..

శశికపూర్ జీవితం ఆధారంగా ‘శశి కపూర్‌, ది హౌస్‌హోల్డర్‌, ది స్టార్‌’ అనే ఆటోబయోగ్రఫీ వచ్చింది. దీనిని అసీం ఛాబ్రా రాశారు. ఇందులో శశి భార్య జెన్నిఫర్‌ మరణం ఆయన జీవితంలో ఎలాంటి పెను మార్పులకుదారితీసిందో వివరించారు.

1983లో జెన్నిఫర్‌కు క్యాన్సర్‌ సోకింది. దాంతో ఆమెకు భారత్‌లో చికిత్స చేయించారు. రోజూవారీ చెకప్‌ల నిమిత్తం పలుమార్లు లండన్‌కు కూడా తీసుకెళ్లారు.జెన్నిఫర్‌కు క్యాన్సర్‌ తగ్గిపోతుందనుకుంటే అది మరింత ముదిరింది. దాంతో ఆమె ఆఖరి రోజుల్లో లండన్‌లోని తన తల్లిదండ్రుల వద్దే గడిపారు.

ఇక జెన్నిఫర్‌ చనిపోవడంతో శశి కపూర్‌ చాలా కుమిలిపోయారు. ఈ విషయాన్ని తన స్నేహితులతో చెప్పుకొని చాలా బాధపడ్డారు. జెన్నిఫర్‌ చనిపోయిన రెండేళ్లలో శశి జీవితంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయని అసీం పుస్తకంలో పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ శశి స్నేహితులు సిమి గరేవాల్‌, అనిల్‌ ధర్కేర్‌లు అసీంకు వివరించారు.

ఆ కాలంలో గట్టిపోటీ..

శశికపూర్‌కు రాజేష్‌ ఖన్నా, అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర లాంటి నటులతో గట్టిపోటీ ఉండేది. దాన్ని ఆయన సానుకూలంగా తీసుకునేవారు తప్పితే ఎవరితోనూ ఆయనకు ఎలాంటి విభేదాలు లేవు. అందుకే ఆయన్ని అందరూ అజాత శత్రువు అంటారు. నేటితరం నటులు ఆయన్ని ముద్దుగా ‘శశి బాబా’ అని పిలిచేవారు.

About the author

Tolly2Bolly

Leave a Comment