సినిమా

‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ మూవీ రివ్యూ..

Written by Tolly2Bolly

‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ మూవీ రివ్యూ..

 

 

తెలుగు తెరపై డిఫెరెండ్ మేనరిజంతో దూసుకొచ్చిన కమెడియన్ సప్తగిరి. సునీల్ లాగానే మొదట్లో కమెడియన్ గా రాణించి ఆ తర్వాత హీరో అవకాశాలు రావడంతో ఇప్పుడు హీరోగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో హీరోగా మారి ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి హీరోగా ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ అనే సినిమాలో నటించాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో  తెలుసుకుందాం!

కథ ఏంటంటే..:

సప్తగిరి పుంగనూరులో ‘లా’ చదువు పూర్తిచేసి ప్రాక్టీస్ కోసం హైదరాబాద్‌కు వస్తాడు. బాగా అనుభవం సంపాదించి లాయర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని పరితపిస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి రాజ్‌పాల్ పాత్ర చేసిన సాయి కుమార్ అనే సీనియర్ మోస్ట్ లాయర్ తారసపడతాడు. కోర్టులో రాజ్‌పాల్ వాదనలు విన్న సప్తగిరి ఆయనకి అభిమాని అయిపోతాడు. కానీ ఒక కేసు విషయంలో రాజ్ పాల్‌‌తో తలపడాలని నిర్ణయించుకుంటాడు. ఇంతకీ ఆ కేసు ఏంటి..? ఆ కేసులో రాజ్‌పాల్‌తో పోరాడి సప్తగిరి నిలబడగలిగాడా..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

* సినిమా ఎలా ఉందంటే..:

బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘జాలీ ఎల్.ఎల్.బి’ సినిమా ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా మొత్తం ఒక కేసు చుట్టూనే తిరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మద్యం సేవించి కారు నడుపుతూ రోడ్ మీద పడుకున్న కొందరిపైకి ఎక్కించేస్తాడు. డబ్బు కోసం ఒక ప్రముఖ లాయర్ ఆ కేసును క్లోజ్ చేయిస్తాడు. అదే కేసుని తిరిగి రీఓపెన్ చేయించి వాదించి చనిపోయిన వారికి న్యాయం చేయాలని నిర్ణయించుకుంటాడు హీరో. ఈ క్రమంలో హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనే విషయాలను చాలా థ్రిల్లింగ్‌గా చూపించాల్సింది. కానీ సినిమాలో అది లోపించింది.

ఎక్కడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ అనేది కలగదు. ఒక్క క్లైమాక్స్ ఎపిసోడ్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. దర్శకుడు కొంతవరకు కామెడీతో నడిపించి అకస్మాత్తుగా హీరోలో వేరియేషన్ చూపిస్తాడు. హీరో మారడానికి గల కారణాలు అంత బలంగా అనిపించవు. అయితే సప్తగిరి కామెడీ మాత్రం బాగా పండించాడు.

సప్తగిరి డాన్సులు, ఫైట్ల కోసం చాలా కష్టపడ్డాడు. కానీ ఇవేవీ సినిమాను నిలబెట్టలేకపోయాయి. సాయి కుమార్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆయన పాత్ర సినిమాకు ప్లస్ అయింది. కథలో కొన్ని మలుపులు  , కథనం మరింత ఆసక్తిగా ఉండడంతో ఈ ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ ఓ మంచి చిత్రంగానే మిగిలిపోతుంది. కెమెరా వర్క్, ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తాయి. సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి న్యాయం కోసం పోరాడే సప్తగిరి ఎల్.ఎల్.బి సినిమాకు న్యాయం చేశాడు.

About the author

Tolly2Bolly

Leave a Comment