సినిమా

పెళ్లయ్యాక ఏంటిది.? సమంత బికీని పోజ్.. షాక్ లో నాగచైతన్య, నాగ్

Written by Tolly2Bolly

సమంత.. సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నప్పుడే తన ఎవర్ గ్రీన్ లవర్ నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. పెళ్లి కూడా హడావుడిగానే సాగిపోయింది. సన్నిహితుల మధ్య గోవాలో ఈ తంతు పూర్తి చేశారు. కనీసం హనీమూన్ కూడా ఎంజాయ్ చేయకుండానే సమంత, నాగచైతన్య సినిమాల్లో బిజీ అయ్యారు..

సమంత.. తన పెళ్లి జరుగుతున్నప్పుడే రంగస్థలం, మహానటి చిత్రాల్లో నటిస్తోంది. నాగచైతన్య కూడా సవ్యసాచి సినిమాలో నటిస్తున్నారు. దీంతో ఇద్దరూ తమ పెళ్లి సంబరాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేదు..

ఇప్పుడు సమంత నటిస్తున్న రంగస్థలం పూర్తయ్యింది.. దీంతో సమంతకు కాస్త సెలవులు దొరికాయి.. నాగచైతన్య కూడా సవ్యసాచి మూవీకి బ్రేక్ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి తమిళనాడులోని తెన్ కాశీ తీరానికి వెళ్లారు. అక్కడ ఓ హోటల్ లో తీరం వెంట ఆహ్లాదంగా గడిపారు.. ఈ సందర్భంగా ఇన్ స్టామ్ గ్రామ్ అకౌంట్లో సమంత బికీనీ వేసుకొని ఉయ్యాల ఊగుతున్న ఫొటోను షేర్ చేసింది. పెళ్లి అయ్యాక భర్తతో ఉండగా ఇలా బికీనీలో ఫొటో షేర్ చేయడం దుమారం రేగింది. అదీ అర్థనగ్నంగా ఉండడంతో నాగచైతన్య, నాగ్ షాక్ అయ్యారట.. కాస్త పద్ధతిగా ఉంటే బాగుండు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

About the author

Tolly2Bolly

Leave a Comment