రాజకీయం సినిమా

బాహుబలిపై సంచలన కామెంట్స్ చేసిన రాష్ట్రపతి

Written by Naresh

బాహుబలి.. తెలుగులోంచి వచ్చిన ఓ కళాఖండం.. రాజమౌళి చెక్కిన ఈ మహాశిల్పం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతటి మహా అద్భుత చిత్రాన్ని అందరూ పొగిడినవారే.. తాజాగా భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కూడా దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి..

హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపు వేడుకకు ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సోదర సోదరీమణులారా నమస్కారం..’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రామ్ నాథ్ కోవింద్ తన ప్రసంగంలో తెలుగు కవుల పేర్లు, గిరిజన హక్కుల కోసం పోరాడిన కొమ్రం భీమ్ వంటి వీరులు, మాజీ రాష్ట్రపతులు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రస్తావించారు. అలాగే బాహుబలి సినిమా గురించి కూడా మాట్లాడారు. బాహుబలి దేశం గర్వించదగ్గ తెలుగు సినిమా అని కీర్తించారు. అచ్చమైన తెలుగు భాషకు ఈ సినిమా నిర్వచనం అని కొనియాడారు.

About the author

Naresh

Leave a Comment