సినిమా

పవన్ కు దొరికిన సాక్ష్యం.. అజ్ఞాతవాసి ఫ్లాప్ అవ్వడానికి కారణం వీళ్లే..

Written by Tolly2Bolly

పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. త్రివిక్రమ్ , పవన్ కాంబోలో వచ్చిన ఈ మూవీపై పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ అంటూ ఫిక్స్ అయ్యారు. కానీ అంచనాలు తలక్రిందులయ్యాయి. అనుకున్న టాక్ రాలేదు. సినిమా యావరేజ్ గా చూడదగ్గట్టే ఉన్నా చాలా మంది ఫ్లాప్ అంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ తన జనసేన కార్యాలయంలో రివ్యూ చేయగా దిమ్మదిరిగే వాస్తవాలు బయటపడ్డాయట..

పవన్ నటించిన అజ్ఞాతవాసిని ఫ్లాప్ అంటూ ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ, దాని అనుబంధ వెబ్ సైట్లు, న్యూస్ చానల్స్, యూట్యూబ్ చానల్స్, సోషల్ మీడియాలో ప్రచారం బాగా చేస్తున్నట్టు జనసేనాని పవన్  టీం గుర్తించినట్టు సమాచారం. దీనిపై సాక్షి టీవీ కూడా అధికారికంగా తన ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలో పెట్టినట్టు గుర్తించారు..

పవన్ కల్యాన్ రాజకీయంగా ఎదుగుతుండడం.. చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తుండడం వైరీ వర్గాలన్నీ ఇప్పుడు పవన్ సినిమాపై పడి యావరేజ్ గా ఉన్న ఫ్లాప్ అని టాక్ ప్రచారం చేస్తున్నాయని పవన్ కనుగొన్నట్టు తెలిసింది.  సాక్షి టీవీ పేరుతో సోషల్ మీడియాలో వచ్చిన పోస్టు కలకలం రేపుతోంది..  ‘‘యాధృచ్చికమే కావొచ్చు కానీ, టీడీపీ ప్రభుత్వం వచ్చాక జనసేన పార్టీ స్తాపించాక పవన్ నటించిన సినిమాలన్నీ ఫ్లాపులే.. గోపాల గోపాల, సర్ధార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, ఇప్పుడు అజ్ఞాతవాసి బయ్యర్లను నిలువునా ముంచేశాయి. ఈ ధాటికి ఉత్తరాంధ్ర డిస్టిబ్యూటర్లు కుదేలై ఆత్మహత్యకు సిద్దమవుతున్నారు’ అంటూ పోస్టులు పెట్టడం సంచలనమైంది. ప్రస్తుతం ఈ పోస్టులపై జనసేన , పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

About the author

Tolly2Bolly

Leave a Comment