సినిమా

అవకాశాల కోసం రకుల్ ప్రీత్ ఇంతలా దిగజారుతుందని ఎవ్వరూ ఊహించలేదు..

Written by Tolly2Bolly

రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్. ఆమె కెరీర్ దక్షిణాదినే ప్రారంభం అయ్యింది. ఒక కన్నడ సినిమాతో ఈమె హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత దక్షిణాదినే పుంజుకుంది. ఒకటీ అర బాలీవుడ్ సినిమాలు చేసిందీమె. ఇప్పుడు దక్షిణాదిన అవకాశాలు తగ్గుతుండటంతో ఈ భామ మళ్లీ బాలీవుడ్ వైపు కన్నేసినట్టుగా ఉంది.

 

తెలుగులో అవకాశాలు తగ్గుముఖం పడుతుండటం వల్లనో ఏమో కానీ.. రకుల్ ప్రీత్ గ్లామర్ డోస్ అమాతం పెంచేసింది. సినిమాలకు మించి పోయిన రీతిల్లో ఫొటో షూట్లలో ఎక్స్‌పోజింగ్ చేస్తోంది ఈ భామ. బహుశా ఏ తెలుగు సినిమాలోనూ రకుల్ ఈ రేంజ్ ఎక్స్ పోజింగ్ తో కనిపించలేదేమో!

ఒక పత్రిక ఫొటోషూట్ కోసం రకుల్ ఇలా రచ్చ చేసింది. తెలుగులో ‘స్పైడర్’ పరాజయంతో రకుల్ బాగా డీలా పడింది. ఈమెకు కొత్త అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయితే తమిళంలో మాత్రం చేతిలో రెండు సినిమాలున్నాయి. అలాగే బాలీవుడ్ నీరజ్ పాండే దర్శకత్వంలో ఒక సినిమాలో చేస్తోంది ఈ భామ. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ను ఆకర్షించడానికి ఇలాంటి పోజులిస్తోందేమో అనే మాట వినిపిస్తోంది.

About the author

Tolly2Bolly

Leave a Comment