సినిమా

అందాలు ఆరబోయడానికి పెళ్లి అడ్డు కాదు..!

Written by Tolly2Bolly
సినీ పరిశ్రమలో అందాలు ఆరబోయడంలో  ముందు వరుసలో ఉండే నమిత ఈమధ్యే వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కాగా సినీ నటులు ప్రేమ వివాహం చేసుకోవడం కామన్.. ఆ తరువాత సినిమాల్లోకి రావడం వెరీ కామన్. అయితే ఇక్కడ నమిత ఏం చెబుతుందో చూస్తే షాక్ అవుతారు.
తెలుగు, తమిళ భాషల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్ నమిత. తన అందచందాలతో యూత్‌ను  ఆకట్టుకున్నది.  తన చిన్ననాటి స్నేహితుడు వీర్‌ను పెళ్లి చేసుకొని హాయిగా జీవితాన్ని గడిపేస్తుంది.. అయితే ఇదివరకే తన భర్త నమిత సినిమాలకు తానెప్పుడూ అడ్డు ఉండనని చెప్పాడు.
నమిత కుడా సినిమాల్లో ఎప్పుడు నటిస్తానని, అంతే కాకుండా అందాలను ఆరబోసేందుకు కూడా  సిద్ధమని  చెప్పుకొచ్చింది.  ప్రస్తుతం నా మెడలో మంగళసూత్రం, కాలికి మెట్టెలు మాత్రమే పెళ్లి త‌ర్వాత‌ వచ్చాయని, సినీ జీవితం ఎప్పటికి ఆలాగే ఉంటుందని చెప్పింది.
ఆలాగే  వీర్ అంటే తనకు చాలా ఇస్తామని,  ఆయన  తనను ప్ర‌పోజ్ చేసినప్పుడు రిజెక్ట్ చేసేందుకు ఏ కార‌ణం దొర‌కలేద‌ని, ఒక‌వేళ వీర్ ప్ర‌పోజ్ చేయ‌క‌పోయి ఉంటే నేనే అత‌న‌ని ప్ర‌పోజ్ చేసి ఉండేదానిని నమిత  చెప్పుకొచ్చింది.

About the author

Tolly2Bolly

Leave a Comment