సినిమా

పవన్ తో సినిమా తీయాలని ఉంది–మనసులోని మాటను బయట బెట్టిన మహేష్ సోదరి.

Written by Tolly2Bolly

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ .. ఈయనను అభిమానించని సినీ ప్రేమికుడు ఉండరు. సినిమాలతో ఈయన ఎంతగా ఫేమస్ అయ్యారో అంతకు మించి తన మంచితనం తో అందరికీ ఆప్తుడయ్యాడు.ఈయన అభిమానులు కొట్లల్లో ఉంటారు. సిల్వర్ స్క్రీన్ పై ఈయన కనిపిస్తే చాలు విజిల్లేవిజిల్లు. ఈయన సినిమా రిలీజ్ అయ్యిందంటే రికార్డుల మోతే. ఈయనతో సినిమా చేయాలన్నది వర్ధమాన దర్శకులకు, నిర్మాతలకూ ఒక మధుర స్వప్నం. వారి జాబితా లోనికి ఇప్పుడు మహేశ్ సోదరి మంజుల కూడా చేరింది.

మహేష్ బాబు అభిమానులకు కూడా కొదవలేదు. సూపర్‌స్టార్ గా పేరు తెచ్చుకున్న ఆయన తనదైన శైలి లో అభిమానులకు వినోదం పంచుతున్నాడు. కథల ఎంపికలో వైవిద్యం చూపుతున్నాడు. సక్సస్ విషయం లో తన తండ్రి క్రిష్ణ ను మించి పొయాడు. త్వరలో “భరత్ అనే నేను”  తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికీ లవర్ బాయ్ ఇమేజ్ తో ఉండే ఈ యువ సూపర్‌స్టార్ సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా రిలిజ్ అయ్యిందంటే పాత రికార్డులు బ్రేక్ కావలసిందే. అటువంటి మహేష్ సోదరి పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని ఉందని చెప్పి సర్వత్రా ఉత్కంఠ రేకెత్తించారు.

మహేష్ సోదరి మంజుల దర్శకురాలిగా పరిచయమౌతున్న సినిమా “మనసుకు నచ్చింది”. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా నటించారు. ఫిబ్రవరి 16 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ చిత్రం ఆడియోను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా, ఈమె విలేఖరులతో మాట్లాడుతూ తన మనసు లోని మాటను బయట పెట్టారు. ఒక విలేఖరి ప్రశ్నకు మంజుల స్పందిస్తూ పవన్ తో సినిమా చేయడానికి ఒక కథ కూడా సిధ్ధంగా ఉందని, తన నాన్న, సొదరుడి తర్వాత తను మెచ్చే వ్యక్తి పవన్ అని, ఆయన, మనసు ఏది చెపితే అది చేస్తారని,నిజాయితీ కల్ వ్యక్తి అని కితాబిచ్చారు. ఇక ఆయన సినిమా చేయరని తనకు తెలుసని, కాని తను రాసుకున్న కథను తను వింటే ఖచ్చితంగా చేస్తారని ఆమె ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ ఒక్క సినిమా చేసి ఆయన రాజకియాల్లోకి వెల్లిపోవచ్చని మంజుల చెప్పడం కొసమెరుపు.

About the author

Tolly2Bolly

Leave a Comment