వార్తలు

తన భార్య , కూతురు వ్యభిచారిణులంటూ వాట్సప్ లో ఫొటోలు పెట్టాడు..

తన భార్య , కూతురు వ్యభిచారిణులంటూ వాట్సప్ లో ఫొటోలు పెట్టాడు..
Written by vamsi

తన భార్య , కూతురు వ్యభిచారిణులంటూ వాట్సప్ లో ఫొటోలు పెట్టాడు..

తన భార్య , కూతురు వ్యభిచారిణులంటూ వాట్సప్ లో ఫొటోలు పెట్టాడు..ఇతరులు ఎవరైనా తమ కుటుంబ సభ్యులను అసభ్య పదజాలం ప్రయోగిస్తే మండిపడుతారు.. కొంచెం బలముంటే బొక్కలు ఇరగదీస్తారు.. కానీ ఓ ప్రబుద్ధుడు తన భార్య, కూతురు వ్యభిచారిణులు అంటూ వాట్సాప్ లో ఫొటోలు పెట్టి ప్రచారం చేస్తున్నాడు..

అయితే ఆయన అలా చేయడానికో బలమైన కారణమే ఉంది..

మహారాష్ట్రలోని ముంబయి నగరం విల్లేపార్లే ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు.. ఈ తరుణంలో ఓ మహిళతో పరిచయం అయింది.. అంతే కాదు.. ఆ పరిచయం కాస్త ఏకాంతంగా ఉండే వరకు వెళ్లింది..

కాగా ఈ వ్యాపారికి ఇదివరకే భార్య, కూతురు ఉన్నారు.. ఈయన బాగోతం చూడలేక వీరిద్దరు ఇతన్ని నాలుగేళ్ల కిందటే విడిచిపెట్టారు..

దీంతో అప్పటి కోపాన్ని ఇప్పడు వారిపై ప్రతాపం చూపాడు.. తనను వదిలి వెళ్లిపోయారనే కోపంతో వ్యాపారి భార్య, కూతుళ్లు వ్యభిచారిణులంటూ వారి ఫోటోలు, ఫోన్ నంబర్లను వాట్సాప్ గ్రూపులో పెట్టాడు.

దీంతో తల్లీకూతుళ్లకు కొందరు ఫోన్ చేసి అమర్యాదగా మాట్లాడుతున్నారు. ఈ ఘటనపై తల్లీ కూతురు చేసిన ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన భర్తను అరెస్టు చేశారు.

About the author

vamsi

Leave a Comment