లైఫ్ స్టైల్ వార్తలు

కండోమ్ యాడ్స్ ఈ సమయాల్లో వేయొద్దు.. !

Written by Tolly2Bolly
ఈ రోజుల్లో టీవీ చానెల్స్ చూద్దామంటే భయం వేస్తుంది.. అందులో ఇంతో ఫ్యామిలీతో చూడలేని సీన్లు ఎన్నో ఉంటున్నాయి. కొన్ని అసభ్యకర అడ్వార్టీసెమెంట్స్ అంతకుముందు కేవలం సినిమా వచ్చినప్పుడే చూసేవాళ్ళం. కానీ ప్రస్తుతం సీరియల్స్ మధ్య మధ్యలోనూ వేస్తున్నారు. దీంతో మహిళలు టీవీ చూడలేని పరిస్థితి ఎదురవుతోంది.. అయితే కొన్ని అసభ్యకర యాడ్స్ కు ఏఎస్‌సీఐ పరిమితులు విధించింది.
మనం టీవీ చూసేటప్పుడు కండొమ్ యాడ్స్ వచ్చినప్పుడు సిగ్గు పడుతుంటాం. ముక్యంగా ఫ్యామిలీతో చూడలేం. ఇటీవల కండోమ్ యాడ్ లో  సన్నీలియోన్  చేసింది. సన్నీలియోన్ అనగానే పక్కా పోర్న్ స్టార్ అని ముద్ర పడింది. ఈ నేపత్యంలో  కండోమ్ యాడ్ లో నటించి మరింత కసి పుట్టిస్తోంది.
దీంతో మహారాష్ట్ర మహిళా కమిషన్ ప్రకటనల విభాగం యొక్క సుప్రీం స్వీయ-నియంత్రణ సంస్థ అయిన ఏఎస్‌సీఐ కు ఫిర్యాదు చేసింది. ఇలా అనేక ఫిర్యాదుల నేపత్యంలో అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్‌సీఐ) ఓ నిర్ణయానికి వచ్చింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కండోమ్ యాడ్స్  రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు మాత్రమే   టీవీల్లో ప్రసారం చేయాలని  సూచించింది.
 కండోమ్ ప్రకటనలు రాత్రివేళల్లో మాత్రమే ప్రసారమయ్యేలా చూడాలని అన్ని టెలివిజన్ చానెళ్లకు తాము సలహా ఇస్తామని ఏఎస్‌సీఐ పేర్కొంది. వాణిజ్య ప్రకటనల్లో ముఖ్యంగా మహిళల చిత్రణలో అసభ్యత, అశ్లీలత లేకుండా చూడాలని సూచించింది.

About the author

Tolly2Bolly

Leave a Comment