వార్తలు

ఏడేళ్ల చిన్న వయసు వ్యక్తితో కమెడియన్ వివాహం..

ఏడేళ్ల చిన్న వయసు వ్యక్తితో కమెడియన్ వివాహం.
Written by vamsi

ఏడేళ్ల చిన్న వయసు వ్యక్తితో కమెడియన్ వివాహం..

ఏడేళ్ల చిన్న వయసు వ్యక్తితో కమెడియన్ వివాహం..సినీ పరిశ్రమలోని వ్యక్తులు సంప్రదాయాలను పక్కనబెట్టి వివాహం చేసుకోవడం అరుదైన విషయమేం కాదు.. ఈ కోవలో ప్రముఖ నటీనటులే ఉన్నారు. వయసులో తేడా ఉన్నా.. ఆస్తి అంతస్తుల్లో తేడా ఉన్నా నచ్చిన వ్యక్తి తగిలితే ఒక్కటి కావడానికి వెనుకాడరు..

ఈ నేపథ్యంలో ప్రముఖ కమెడియన్ భారతీ సింగ్(33) తన కంటే ఏడేళ్ల వయసున్న వ్యక్తిని వివాహం చేసుకొని వార్తల్లోకెక్కింది. తనకంటే ఏడేళ్ల చిన్నవాడైన హర్ష్ లింబ్చియాను మనువాడింది. ఆదివారం సాయంత్రం గోవాలోని ఒక రిసార్ట్స్‌లో ఒక్కటైన ఈ జంటకు జూన్‌లోనే నిశ్చితార్థం జరిగింది. అప్పడు డిసెంబరు 3న వివాహం జరపాలని పెద్దలు నిర్ణయించారు.

అనుకున్న ప్రకారంగానే నవంబరు 27న పంజాబీ సాంప్రదాయ రీతిలో వివాహ తంతు ప్రారంభమైంది. 29న భారతీ సింగ్ కుటుబ సభ్యులు, బంధువులు ముంబైలోని ఆమె ఇంటికి చేరుకున్నారు. 30న భారతి, హర్ష్ కుటుంబాల సభ్యులంతాకలిసి గోవా చేరుకున్నారు.

డిసెంబరు 1న గోవాలోని అడోమా రిసార్ట్స్‌లో భారతి, హర్ష్‌లు తమ స్నేహితులకు ఘనంగా పార్టీ ఇచ్చారు. 2న మెహందీ ఫంక్షన్ జరిగింది. అదేరోజు రాత్రి కాక్‌టేల్ పార్టీ జరిగింది. 3న వీరిద్దరి వివాహం ఘనంగా జరిగిందిఅంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది.

ఈ సందర్భంగా వీరి వివాహానికి ప్రముఖ టీవీ నటులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.. అయితే నచ్చిన వ్యక్తి ఎదురు పడితే ఏ భేదం లేకుండా చేసుకోవడమే ఉత్తమమంటూ వివాహానికి హాజరైన వారు చర్చించుకోవడం ప్రారంభించారు.

About the author

vamsi

Leave a Comment