వార్తలు

దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు.. ఆయన ఆస్తులెంతో తెలిస్తే షాక్ అవుతారు.. కేసీఆర్ ఆస్తులెంతంటే..

Written by Tolly2Bolly

అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) సంస్థ దేశంలోని సీఎంలందరి ఆస్తులపై సర్వే చేసింది. ఈ సందర్భంగా దేశంలోనే అందరి సీఎంల కంటే ఏపీ సీఎం చంద్రబాబు మొదటి స్థానంలో నిలవడం విశేషం. చంద్రబాబు కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.177 కోట్లు అని తేలింది. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రూ.129కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ రూ.48 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు..

ఇక ప్రతీ విషయంలో చంద్రబాబుతో సమానంగా దూసుకెళ్లే తెలంగాణ ముఖ్యమంత్రి ఆస్తులు మాత్రం తీసికట్టుగా ఉన్నాయి. కేసీఆర్ ఆస్తులు కేవలం రూ.15.51 కోట్లు మాత్రమే.. అత్యధిక ఆస్తులున్న జాబితాలో కేసీఆర్ 4వ స్థానంలో నిలిచారు. ఇక అతితక్కువ ఆస్తులున్న వారి జాబితాలో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ఉన్నారు. ఈయన మొత్తం ఆస్తులు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. కేవలం 26లక్షల ఆస్తులు మాత్రమే ఈయనకు ఉన్నాయి. చివరి నుంచి రెండో స్థానంలో మమతా బెనర్జీ రూ.30 లక్షల ఆస్తులతో ఉన్నారు. దేశంలో 100 కోట్లకు పైగా ఆస్తులున్న వారు ఇద్దరే కాగా.. అందులో చంద్రబాబు మొదటి స్థానంలో ఉండడం విశేషం.

About the author

Tolly2Bolly

Leave a Comment