రాజకీయం

‘చలోరే చలోరే.. చల్..’ రాజకీయ సంచలనం సృష్టించిన పవన్

Written by Tolly2Bolly

‘చలోరే చలోరే.. చల్..’ రాజకీయ సంచలనం సృష్టించిన పవన్

ప్రస్తుతం ‘అజ్ఞాతవాసి’ సినిమా షూటింగ్ లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సినిమా ఇంకా పూర్తికాకముందే రాజకీయ సంచలనం సృష్టించారు. ఈరోజు తన జనసేన పార్టీ నుంచి ‘చలోరే చలోరే.. చల్’ అంటూ రాజకీయ స్ఫూర్తి పాటను రూపొందించి విడుదల చేశారు. ఈ సందర్భంగా త్వరలోనే పవన్ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో పాలుపంచుకుంటారని.. ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాడని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగానే ఓ పాటను రూపొందించి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ‘చలోరే చలోరే’ అంటూ సాగే ఈ పాటను ఈరోజు జనసేన పార్టీ విడుదల చేసింది.

పవన్ అజ్ఞాతవాసి సినిమా విడుదల కాగానే విజయనగరం జిల్లా నుంచి తన పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ యాత్రకు ‘చలోరే చలోరే చల్‌’ గా నామకరణం చేసిన పవన్.. ఉద్వేగంతో కూడిన ఓ ఇన్ స్పిరేషన్ పాటను సోషల్ మీడియాలో విడుదలచేశారు. గుంటూరు కు చెందిన శేషేంద్ర శర్మ సాహిత్యాన్ని ఈ పాటకు సాహిత్యాన్ని మాటలను అందించారు. కొద్దిసేపటి కిందటే విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది.

పవన్ తన రాజకీయ యాత్రల కోసం రూపొందించిన పాట ఇదే..

About the author

Tolly2Bolly

Leave a Comment