సినిమా

‘భాగమతి’ కి ‘బరువు’ కష్టాలు. 

Written by Tolly2Bolly
భాగమతి అనుష్క కు కొత్త కష్టాలొచ్చాయి.. జీరో సైజ్ సినిమా కోసం ఊహించనంతగా బరువు పెరిగిన అనుష్క.. ఇప్పుడు దానిని తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతోందట. ప్రస్తుతం అనుష్క బ్యాక్ పెయిన్‌తో బాధ పడుతోందని సమాచారం.
బాహుబలి సినిమా తీస్తున్న సమయంలో మధ్యలో వచ్చిన  గ్యాప్లో అనుష్క జీరో సైజ్ సినిమా చేసింది. దర్శకుడు రాఘవేంద్ర రావు కొడుకు సూర్య ప్రకాష్ ఈ సినిమాను డైరెక్షన్ చేసాడు.  ఈ సినిమాలో మితిమీరిన  బరువు పెరిగి సినిమాలో ఆకట్టుకుంది.. ఐతే. ఆ తరువాత  మల్లి బాహుబలి సినిమా కోసం బరువు తగ్గేందుకు ప్రయత్నించినా బాహుబలి-2 లో కొంచెం బొద్దుగానే కనిపించింది.
జీరో సైజ్ సినిమా కోసం  బరువు పెరిగిన అనుష్క..  దానిని తగ్గించుకునే ప్రయత్నంలో బ్యాక్ పెయిన్‌ వచ్చిందట.. దీంతో జీరో సైజ్ సినిమా ఎందుకు చేసానా అని ఫీల్ అవుతుందట..
బ్యాక్ పెయిన్ కారణంగా ఈ ముద్దుగుమ్మ ఫిట్‌నెస్ ఎక్సర్‌సైజ్ చేయలేకపోతోందట. పెయిన్‌ని తగ్గించుకునేందుకు స్పా తెరపి కోసం అనుష్క కోయంబత్తూర్, కేరళ కూడా వెళ్లిందట. తన బాధను నేచురల్ థెరపీ ద్వారా తగ్గించుకుందామనుకుంటోందట. దీనికి కొంత సమయం పడుతుందట. అందుకే ఆమె ఏ సినిమాలకు కమిట్ అవడం లేదని సమాచారం.

About the author

Tolly2Bolly

Leave a Comment