సినిమా

అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. అనిరుధ్ ఔట్.. ఎన్టీఆర్ సినిమాకు కొత్త సంగీత దర్శకుడిని తీసుకున్న త్రివిక్రమ్

Written by Tolly2Bolly

అజ్ఞాతవాసి ఎఫెక్ట్ బాగానే పడింది త్రివిక్రమ్ పై.. అందుకే తన కొత్త సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చేశాడు. అత్తారింటికి దారేది వరకు దేవీశ్రీ ప్రసాద్ తో కలిసి సినిమాలు తీసిన త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’కి మాత్రం తమిళ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ తీసుకున్నారు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం.. తెలుగు నేటివిటీకి తగ్గట్టు అనిరుధ్ మ్యూజిక్ లేకపోవడం విమర్శలు వచ్చాయి.. దీంతో త్రివిక్రమ్ తను తాజాగా ఎన్టీఆర్ తో తీసే సినిమాకు కొత్త సంగీత దర్శకుడిని ఎంచుకున్నాడు.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు సంగీతం అందించే బాధ్యత ఎస్ఎస్ థమన్ కు దక్కిందన్న వార్తలు వస్తున్నాయి. భాగమతి, తొలి ప్రేమ ఇలా ఈ ఏడాది తమన్  మ్యూజిక్ అందించిన సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ రెండు చిత్రాలకు తమన్ నేపథ్య సంగీతం కూడా ప్రాణం పోసింది.

అయితే తొలుత ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీకి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ఎంపికైనా.. కొన్ని కారణాల వల్ల ఆ స్థానంలోకి దేవీ శ్రీ ప్రసాద్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వినిపించాయి. కానీ తమన్ నే ఫైనల్ చేశారని లేటెస్ట్ టాక్..

About the author

Tolly2Bolly

Leave a Comment