సినిమా

యాంకర్ కాకముందు ప్రదీప్ రోడ్డు పక్కన ఏం చేసేవాడో చూస్తే షాకే..

Written by Tolly2Bolly

యాంకర్ ప్రదీప్.. బుల్లితెరపై ఇప్పుడు ఫేమస్ యాంకర్.. అతడు ఈ స్టేజ్ కు రావడానికి ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో డక్కామోక్కీలు తిన్నాడు. అందుకే పేదల కోసం.. ఆపన్నుల కోసం ఏదైనా చేయాలని తపిస్తుంటాడు. అయితే గడిచిన డిసెంబర్ 31 రాత్రి ఫుల్లుగా మద్యం తాగి పోలీసులకు దొరకడంతో కొంత ప్రదీప్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది..

ప్రస్తుతం బెంజ్ కార్లో తిరిగే ప్రదీప్ ఒకనాడు చాలా దీన స్థితిలో ఉండేవాడట. హైదరాబాద్ లో మొదట్లో జాబ్ ఏమీ లేక ఓ ప్రైవేట్ ఏజెన్సీలో 10 వేల లోపు ఉద్యోగానికి చేరాడట.. వారి వస్తువులు పట్టుకొని హైదరాబాద్ జనాలు ఎక్కువగా ఉండే రోడ్లపై నిలబడే వస్తువులు అమ్మేవాడట.. ఆ తర్వాత ఆ ఉద్యోగం తనకు సూట్ అవదని ఓ రేడియో స్టేషన్ లో జాకీగా ఉద్యోగంలో చేరాడు. అలా మొదలైన ప్రదీప్ ప్రస్థానం ఇక వెనుదిరిగి చూసుకోకుండా దూసుకెళ్లింది. రేడియో జాకీ నుంచి యాంకర్ గా.. ఇప్పుడు కొన్ని సినిమాల్లో నటుడిగా ఎదిగాడు ప్రదీప్.

ఒకప్పుడు రోడ్డు పక్కన నిలబడి ఏవో వస్తువులు అమ్మి పొట్టపోసుకున్న ప్రదీప్ స్వయంకృషితో నేడు బుల్లితెరపై నంబర్ 1 యాంకర్ గా ఎదిగాడు.. బెంజ్ కార్లో తిరిగే స్థాయిలో ఉన్నాడు. ప్రదీప్ కష్టం వెనుక ఎన్నో ఎదురుదెబ్బలు.. ఎంతో కష్టం దాగి ఉంది. తాను ఇండస్ట్రీలో నిలబడడానికి పడ్డ కష్టాలపై ప్రదీప్ ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించడంతో ఈ విషయాలు వెలుగుచూశాయి.

About the author

Tolly2Bolly

Leave a Comment