సినిమా

కన్ను కొట్టిన అమ్మాయికి అల్లు అర్జున్ ఏం రిప్లై ఇచ్చాడో చూస్తే నిద్ర పట్టదు..

Written by Tolly2Bolly

ప్రేమికుల రోజు సందర్భంగా మలయాళంలో నిర్మిస్తున్న ఓ ప్రేమకథా చిత్రం పాట ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఆ పాట ట్రైలర్ లో ఓ అందమైన అమ్మాయి తన ఓరచూపులతోనే ప్రియుణ్ని చూస్తూ.. కన్ను కొడుతున్న సన్నివేశం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.. ప్రేమికుల రోజు వచ్చేస్తున్న సమయంలో ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది.

మళయాళంలో తెరకెక్కుతున్న ‘ఒరు అదర్ లవ్’ అనే చిత్రంలో ఒక కథానాయికగా నటిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్ ఆ చిత్రంలో హైస్కూలు విద్యార్థినిగా నటిస్తోంది. అయితే ఆదివారం విడుదలైన ఈ ట్రైలర్ లో ప్రియా ఎక్స్ ప్రెషన్స్ కి యువత ఫిదా అయిపోతున్నారు.

ఈ ట్రైలర్ ఈరోజు చూసిన అల్లు అర్జున్ ఆ అమ్మాయి చూపులకు ఫిదా అయిపోయాడు. తాజాగా అల్లు అర్జున్ తన ట్విట్టర్ పేజీలో ఈ వీడియోని షేర్ చేసి.. ‘ఈ మధ్యకాలంలో ఇంత క్యూటెస్ట్  వీడియోని నేనసలు చూడలేదు. సింప్లిసిటీకి ఉన్న పవరే ఇది. నాకు బాగా నచ్చింది’ అంటూ అల్లు అర్జున్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

About the author

Tolly2Bolly

Leave a Comment